అవును, మీరు విన్నది నిజమే.ఆ రోబో( Robot ) తయారు చేయడానికి కేవలం రూ.2వేలు మాత్రమే ఖర్చు అయ్యాయి.అయితేనేం, అది ఏకంగా అతిథి మర్యాదలు చేసేస్తుంది.
పనికిరాని వస్తువులతో ఓ యువకుడు సదరు రోబోను తయారుచేయడం విశేషం.ఆహారం, నీళ్లు ఇలా ఇతర ఇంటిపనులు చేసేలా దాన్ని తీర్చిదిద్దాడు.
మరోవైపు, ఆ వ్యక్తి నిరుద్యోగుల కోసం ఓ యాప్ తీసుకువచ్చాడు.యువతలోని ట్యాలెంట్‌ను వినియోగదారుల వద్దకు చేర్చేలా టింగ్ టాంగ్ అనే యాప్‌ను రూపొందించడం విశేషం.

బెంగాల్ కు చెందిన దేబాశిష్ దత్తా అనే యువకుడు ఇంటికి వచ్చిన అతిథులకు( Guests ) ఆహారం, నీళ్లు అందించడం సహా వివిధ పనులు చేసేలా ఆ మరమనిషిని రూపొందించడం విశేషం.అవార్డు ఫంక్షన్లలో పురస్కారాలు సైతం ఇది ప్రదానం చేస్తుందని కూడా అతడు చెప్పడం విశేషం.దేబాశిష్ దత్తా.( Debashish Dutta ) సిలిగుడికిలో బాగ్డోగ్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు.నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్న దేబాశిష్కు రోబోలంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం.వాటిని తయారుచేయాలని కలల కనేవాడు.
ఈ క్రమంలోనే దీనిని తయారుచేయగలిగాడు.

అయితే దానిని అతగాడు ఒక్కరోజులో పూర్తి చేయలేదు.దాని వెనుక చాలా కృషి దాగివుంది.వాటిని తయారు చేసేంత ఆర్థిక స్తోమత కూడా లేదు.
అయినా పట్టువిడవకుండా ఇంట్లో పనికిరాని వస్తువులతో 2 నెలలు శ్రమించి ఓ రోబోను తయారుచేశాడు.దానికి సీ-ప్రోగ్రామింగ్ సహాయంతో.
కోడింగ్ చేశాడు.రోబోకు ‘బిధు శేఖర్’ అని పేరు పెట్టడం ఇక్కడ కొసమెరుపు.
ఆ మరమనిషిని తయారు చేయడానికి 2వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని చెప్పాడు దేబాశిష్.ఈ రోబోకు నాలుగు చక్రాలు అమర్చి.
బ్లూటూత్‌తో అనుసంధానం చేశాడు దేబాశిష్.అంతేకాకుండా రోబోను నియంత్రించడానికి రిమోట్ యాప్‌ను రూపొందించాడు.
మొబైల్ ఫోన్లోని ఆ యాప్ ద్వారా రోబోను కదిలించవచ్చు.







