యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.ఈ సంవత్సరంలో ఆదిపురుష్( Adipurush ) మరియు సలార్( Salar ) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే సంవత్సరం మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక వచ్చే సంవత్సరం ప్రభాస్ ప్రముఖ దర్శకుడు క్రిష్ ( Krish )దర్శకత్వంలో ఒక సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే దర్శకుడు క్రిష్ వెళ్లి ప్రభాస్ కి కథ చెప్పడం జరిగిందని.ప్రభాస్ కూడా ఆ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.ప్రధానంగా ప్రభాస్ మరియు క్రిష్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్ గా అనుష్క( Anushka )ను నటింపజేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.అనుష్క అనారోగ్య కారణాల వల్ల గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.
అభిమానుల పోరు తట్టుకోలేక నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది.అంతకు మించి అనుష్క సినిమాలు ఏమీ చేయడం లేదు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే అనుష్క ఆ సినిమాలను చేసేందుకు ఓకే చెప్తోంది.అంతే తప్పితే బయట సినిమాలకు అనుష్క అస్సలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
అనుష్క అనారోగ్య కారణాలతో బరువు పెరిగింది, అంతే కాకుండా ఆమె ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.కనుక ఈ సమయంలో వరుసగా సినిమాలు చేయడం దాదాపు అసాధ్యం అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

అందుకే ప్రభాస్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో అనుష్క హీరోయిన్ అంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరో సంవత్సరం పాటు సమయం ఉంది కనుక ఆలోపు ఏదైనా జరగవచ్చు అని ప్రభాస్ అభిమానులు కొందరు అనుష్క పై నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ప్రభాస్ సినిమాలకు తోడు అనుష్కతో కూడా ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా స్థాయి ఆ మాత్రం పెరిగి పోయే అవకాశాలున్నాయి.ఎందుకంటే ప్రభాస్ అనుష్క కాంబినేషన్ అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరు.







