తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరిలో మంచి జంట ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ బాబు( Mahesh Babu ) నమ్రతల( Namrata ) జంట అనే చెప్పాలి అయితే వీరిద్దరూ వంశీ సినిమా( Vamsi movie ) చేసే టైంలో ప్రేమలో పడి చాలా రోజులు ప్రేమించుకొని ఆ తర్వాత చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వంశీ సినిమా షూటింగ్ టైంలో మహేష్ బాబును చూసిన నమ్రత తొలిచూపులోనే ప్రేమలో పడిందట.
దాంతో షూటింగ్స్ కోసం వేరే దేశానికి వెళ్ళినప్పుడు నమ్రత మహేష్ బాబు మీద ఉన్న ప్రేమని వ్యక్తపరిచిందట.కానీ మహేష్ బాబు మాత్రం కాస్త టైం కావాలని అడిగారట.కానీ ఆ తర్వాత మహేష్ కి కూడా నమ్రత నచ్చడంతో ఇద్దరు కొన్ని రోజులు ప్రేమించుకున్నారు.అయితే ఈ విషయాన్ని నమ్రత తన ఫ్యామిలీతో చెప్పి ఒప్పించిందట.
కానీ మహేష్ బాబు మాత్రం నమ్రతని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు కృష్ణ( Krishna ) నమ్రతతో పెళ్లికి ఏమాత్రం ఒప్పుకోలేదట.
కానీ మహేష్ బాబు తో పాటు ఇందిరాదేవి, మంజుల( Indira Devi, Manjula ) ఇలా ఇంట్లో వారందరూ కృష్ణ ని ఒప్పించడంతో మహేష్ నమ్రత ల పెళ్లికి కృష్ణ కూడా ఒప్పుకోవలసి వచ్చిందిట.
ఇక పెళ్లైనప్పటి నుండి నమ్రత సినిమాలకు దూరంగా ఇంటిపట్టునే ఉంటూ బిజినెస్లను చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది…ఇక మహేష్ బాబు మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో టాప్ హీరో గా దూసుకుపోతున్నాడు…
.