మాస్ కా దాస్( Mas Ka Das ) విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నాడు.దాస్ కాద్ ధంకీ అంటూ తన సెకండ్ డైరెక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్ తన నెక్స్ట్ మూవీని మొదలు పెట్టాడు.
చైతన్య కృష్ణ( Chaitanya Krishna ) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని తీసుకున్నారు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుస సినిమాలైతే చేస్తుంది కానీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
అయితే ఈమధ్య వెబ్ సీరీస్ లతో అలరిస్తున్న అంజలి విశ్వక్ సేన్ ( Vishwak Sen )సినిమాతో అలరించాలని చూస్తుంది.
అంజలి పని దాదాపు అయిపోయింది అనుకున్న వారికి ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది.
విశ్వక్ సేన్ లాంటి యువ హీరో సరసన అంజలి ఛాన్స్ అంటే తప్పకుండా అమ్మడి కెరీర్ కు ఇది మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ పిక్చర్స్( Fortune Pictures ) కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా వస్తుంది.
ఈమధ్య తెలుగు తెర మీద పీరియాడికల్ సినిమాలకు డిమాండ్ బాగుంది కాబట్టి ఈ సినిమాతో విశ్వక్ సేన్ తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు.







