తెలంగాణలో త్వరలోనే దళితబంధు మరో విడత నిధులు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.దళితబంధు పథకంలో ఎటువంటి అవినీతిని సహించేది లేదని పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలోని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్లేస్ లను గుర్తిస్తామని కేసీఆర్ తెలిపారు.ఈ మేరకు ఇంటి స్థలాలకు సంబంధించి ఈనెల 30వ తేదీన జీవోను విడుదల చేస్తామని వెల్లడించారు.
అదేవిధంగా కొత్త సచివాలయంలో ఇవే జీవోలు ముందుగా వస్తాయని పేర్కొన్నారు.ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ పని తీరును మార్చుకోవాలని కేసీఆర్ సూచించారు.







