ముంబై షెడ్యూల్ పూర్తి చేసిన 'ఓజి'.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ”ఓజి” ( OG Movie ) ఒకటి.ఈ సినిమా మీద ఫ్యాన్స్ భారీ హోప్స్ పెంచేసు కుంటున్నారు.

 Pawan Kalyan Sujeeth Og Shoot Update, Director Sujeeth, Og Movie, Pawan Kalyan,-TeluguStop.com

ఎందుకంటే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుంది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ( Director Sujeeth ) కాబట్టి.ఈయన సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.

గత సినిమా సాహో ప్లాప్ అయిన కూడా ఈయన టాలెంట్ కు మాత్రం అందరు ఫిదా అయ్యారు.

అందుకే పవర్ స్టార్ తో సినిమా తీస్తున్నాడు అంటూ ఈయనను ఏ రేంజ్ లో చూపిస్తాడో అని ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

అసలు ఈ సినిమా ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ అవ్వదు అని అంతా అనుకున్నారు.కానీ అందరిని ఆశ్చర్య పరుస్తూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను వెంటనే స్టార్ట్ చేసాడు.

ఓజి అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ముంబైలో స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేసినట్టు తెలుస్తుంది.ఇక ఇప్పుడు రెండవ షెడ్యూల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.భారీ యాక్షన్ షూట్ తో ముంబైలో స్టార్ట్ చెయ్యగా ఇప్పుడు కంప్లీట్ అయ్యింది.

ఇక నెక్స్ట్ షెడ్యూల్ పూణేలో స్టార్ట్ చేయనున్నారట.పవన్ కు చిన్న చిన్న పనులు ఉన్నందున అవి పూర్తి కాగానే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.

మే ఫస్ట్ వీక్ నుండి పూణేలో స్టార్ట్ కానున్న ఈ షెడ్యూల్ వారం రోజులు జరగనుందని తెలుస్తుంది.మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ ( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.కాగా ఈ సినిమాకు థమన్ ( Thaman ) సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube