వైల్డెస్ట్ యాక్షన్.. 'ఏజెంట్' నుండి మరో పోస్టర్!

అక్కినేని యువ హీరోల్లో ఒకరైన అఖిల్ ( Akhil Akkineni ) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘‘ఏజెంట్”( Agent ) .ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Wildest Poster Of Akhil Akkineni's Agent Movie Is Out, Akhil Akkineni, Tollywoo-TeluguStop.com

మరి రేపు గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై మరింత హైప్ తెచ్చేందుకు మేకర్స్ తమవంతు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేసారు.నిన్ననే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఇంట్రెస్టింగ్ వీడియో ప్లాన్ చేసినట్టు హింట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.ఇలా పోస్టర్స్ తోనే ఫ్యాన్స్ కు భారీ హైప్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

వైల్డెస్ట్ యాక్షన్ ( Wildest Poster) అంటూ ఇంతకు ముందు వచ్చిన గన్స్, బ్లాస్ట్ వంటి పోస్టర్స్ కంటే కూడా పదునైన గొడ్డళ్లు పట్టుకుని మరింత వైల్డ్ గా అఖిల్ ను చూపించారు.

మొత్తానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ( Surender Reddy ) ఈసారి అఖిల్ ను ఈ రేంజ్ లో వైల్డ్ గా చూపించడంతో ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇక ఏజెంట్ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ( Mammootty ) నటిస్తున్నాడు.హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తుండగా ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.మరి అఖిల్ రెండేళ్ల కష్టానికి ఈ సినిమా ఆశించిన ఫలితం ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube