సాధారణంగా హీరో హీరోయిన్ లకు అభిమానులు ఉండడం అన్నది సర్వసాధారణం.అయితే కొందరు డై హార్ట్ ఫ్యాన్స్( die heart fans ) కూడా ఉంటారు.
అటువంటివారు సినిమా విడుదల అయింది అంతే చాలు థియేటర్ల వద్ద భారీ కటౌట్ నిర్మించి పాలాభిషేకాలు పెద్ద పెద్ద పూలదండలు చేసి వారి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.ఇంకొంతమంది అభిమానులు అలా డబ్బు వృధా చేయకుండా వారి అభిమాన హీరో హీరోయిన్ల పై కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు.
ఇంకొందరు అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్ ల పేర్లు లేదంటే ఫోటోలను టాటూలు వేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే అభిమాని ఏకంగా ఒక హీరోయిన్ కి గుడి కట్టేశాడు.అసలు ఆ అభిమాని ఎవరు? ఏ హీరోయిన్ కి గుడి కడుతున్నారు అన్న వివరాల్లోకి వెళితే.స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.
ఈమెకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే అభిమాని కూడా ఒకరు.
బాపట్ల జిల్లా ఆలపాడు జిల్లాకి చెందిన సందీప్ ( Sandeep )సమంతకు డై హార్ట్ ఫ్యాన్.సమంత పై ఉన్న అభిమానంతో ఏకంగా ఆమెకు తన ఇంటిలోనే గుడిని నిర్మించి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నాడు.

అయితే ఇప్పటివరకు హీరోయిన్లకు గుడి కట్టించడం చూసాము కానీ ఇలా ఇంట్లోనే హీరోయిన్ కు గుడి కట్టించడం అన్నది మొదటిసారి అని చెప్పవచ్చు.ప్రస్తుతం విగ్రహం తయారు పూర్తి కాగా గుడి నిర్మాణంలో ఉంది.ఆ గుడి ఏప్రిల్ 28 న ప్రారంభించనున్నట్లు తెలిపారు సందీప్.టాలీవుడ్ హీరోయిన్లలో ఏ హీరోయిన్ కి దక్కని ఘనత హీరోయిన్ సమంతకు దక్కిందని చెప్పవచ్చు.ఇప్పటివరకు హీరోయిన్ నమిత, హన్సిక, ఖుష్బూ లాంటి హీరోయిన్లకు తమిళ అభిమానులు గుడి కట్టించిన విషయం తెలిసిందే.మన తెలుగులో ఏకంగా ఒక స్టార్ హీరోయిన్ కి గుడి కట్టించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.







