కర్ణాటక నుండి దేశ రాజకీయాల ముఖ చిత్రం మార్పు షురూ!

వచ్చే సంవత్సరం పార్లమెంట్ కి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం తెల్సిందే.మూడవ సారి పార్లమెంట్‌ లో అధికార పార్టీగా అడుగు పెట్టాలని బీజేపీ( BJP ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

 Karnataka Assembly Elections Interesting Polling Update , Bjp , Congress , Karn-TeluguStop.com

ప్రధానిగా నరేంద్ర మోడీ( Narendra Modi ) మూడవ సారి బాధ్యతలు చేపట్టి రికార్డును దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.ఈ నేపథ్యంలో జరుగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

Telugu Congress, Kannada, Karnataka, Modi, Narendra Modi-Politics

ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో కొన్ని మీడియా సంస్థలు చేపట్టిన సర్వేల్లో పలు ఆసక్తికర విషయాలు వెళ్లడి అయ్యాయి.ముఖ్యంగా ఈసారి బీజేపీ అధికారం దక్కించుకోవడం కష్టంగా ఆ సర్వే రిపోర్ట్‌ లు చెబుతున్నాయి.బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దక్కించుకోలేక పోవచ్చు అంటూ వారు అంటున్నారు.గతంలో కూడా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను సొంతం చేసుకోలేదు.కానీ అధికారాన్ని సొంతం చేసుకుంది.అయితే ఈసారి సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీ అవతరించే అవకాశాలు కనిపించడం లేదని సర్వే చేసిన వారు చెబుతున్నారు.

బీజేపీ చేయించుకున్న సర్వే ఫలితం కూడా అదే అన్నట్లుగా కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఎన్నికలు మరి కొన్ని రోజులు ఉన్న ఈ సమయంలో ఏం జరుగుతుందో అంటూ అంతా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.

ఒక వేళ కన్నడ రాజకీయాల్లో పెను సంచలనం నమోదు అయ్యి బీజేపీ ఓడి పోయి కాంగ్రెస్ గెలిస్తే జాతీయ రాజకీయాలపై ప్రభావం ఎంత అంటే కచ్చితంగా కొంత అయినా ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Congress, Kannada, Karnataka, Modi, Narendra Modi-Politics

జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం నమోదు అయ్యేనా అంటే అనుమానమే కానీ కచ్చితంగా జాతీయ స్థాయి లో రాజకీయ ముఖ చిత్రం మారుతుందని కొందరు అంటున్నారు.అంటే బీజేపీ సొంతంగా ప్రభుత్వంను ఏర్పాటు చేయడం దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు.అంతే కాకుండా దేశం లో కాంగ్రెస్ పార్టీ( Congress party ) మెరుగు పడుతుందని ఒక సర్వే రిపోర్ట్‌ చెబుతోంది.

మొత్తానికి ఏడాది సమయం ఉన్న ఈ సమయంలో జాతీయ రాజకీయాల్లో వేడి మొదలు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube