అవినాష్ రెడ్డి విషయంలో అన్ని అస్త్రాలు వాడేసిన వైసిపి

కడప మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసు( YS Vivekananda Reddy Murder Case ) విషయంలో ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడటానికి అధికార వైసీపీ పార్టీ తాను చేయగలిగిందంతా చేసింది, అన్ని అస్త్రాలను వాడేసిన తర్వాత ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే అంచనాకు ఆ పార్టీ వచ్చిందని తెలుస్తుంది .ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను చూస్తుంటే అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో వారు మానసికంగా సిద్ధమయ్యారని ఆ తదనంతర పరిణామాలను ఎలా ఎదుర్కోవాలా అని రెఢీ అవుతున్నట్లుగా తెలుస్తుంది .

 Ycp Fixed About Avinash Reddy Arrest-TeluguStop.com
Telugu Ap, Avinash Reddy, Sunitha Reddy, Ys Jagan, Ysvivekananda-Telugu Politica

సిబిఐ విచారణ తర్వాత పులివెందులలోని తన నివాసానికి వెళ్లిన అవినాష్ రెడ్డి అ క్కడ ప్రజా దర్బార్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది.ఆ తర్వాత తన గెస్ట్ హౌస్ లో పార్టీ కీలక ఎమ్మెల్యేలతో తదుపరి పరిణామాల గురించి చర్చ జరిగిందని ,అరెస్టు తప్పదని తెలిపోయినందున తదుపరి పరిణామాల విషయం లో ఏ రకంగా ముందుకు వెళ్లాలనే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అని తీవ్ర చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది .అరెస్ట్ అయితే బెయిల్ పై బయటకు వస్తారు అంటూ ఆ పార్టీ నేత రాచమల్లు మీడియాతో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అరెస్టు తప్పదని వైసిపి కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆయనకు ఉన్న న్యాయ పరమైన రక్షణలు కూడా తొలగి పోయినందున ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని ఆ పార్టీ అంచనా వేస్తుంది .

Telugu Ap, Avinash Reddy, Sunitha Reddy, Ys Jagan, Ysvivekananda-Telugu Politica

తన అరెస్ట్ పై ఒక అంచనకు వచ్చిన అవినాష్ రెడ్డి( Y.S.Avinash Reddy ) మాటల్లో కూడా వేదాంత దొరణి కనిపిస్తుందని తెలుస్తుంది.దేవుడు ఉన్నాడని, ఆయన చూసుకుంటాడని న్యాయమే గెలుస్తుంది అని ఆయన నేతలతో చెప్తున్నారట .అనవసరంగా ఈ కేసులో తనను ఇరికిస్తునారాని , సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సునీత ( Sunitha Reddy )చాలా సార్లు మార్చుకున్నారని ఆయన పదేపదే చెప్తున్నారు .

Telugu Ap, Avinash Reddy, Sunitha Reddy, Ys Jagan, Ysvivekananda-Telugu Politica

అయితే అరెస్టు చేసినప్పటికీ ఈ హత్య విషయంలో తన పాత్రను ప్రూవ్ చేయటం సిపిఐ కి సాద్యం కాదని ఆయన బలంగా నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది … కేవలం దస్తగిరి వాంగ్మూలం తప్ప ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర నిరూపించే ఏ బలమైన ఆధారాలు లేవు కాబట్టి తాను కేసు విషయంలో కచ్చితంగా బయట పడగలనన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube