శ్రీవాస్ ( Sriwas )డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సినిమా రామబాణం.ఈ సినిమా మే 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో గోపీచంద్( Gopichand ) సరసన డింపుల్ హయతి ( Dimple Hayati )నటించింది.ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లేటెస్ట్ గా జరిగింది.
ఈ ప్రెస్ మీట్ లో భాగంగా సినిమాను హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నయని నిర్మాతలు వెల్లడించారు.గోపీచంద్ సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉంది.
డబ్బింగ్ రైట్స్ ద్వారానే ఆయన సగం బడ్జెట్ రికవర్ అవుతుంది.అయితే డబ్బింగ్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు రిలీజ్ తో పాటుగా హిందీ రిలీజ్ ని కూడా ఒకేసారి చేస్తామని కాపీ రెడీ చేయమని చెప్పారట.
సో గోపీచంద్ రామబాణం కూడా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా విషయంలో గోపీచంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.మరి గోపీచంద్ ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేని గోపీచంద్ రామబాణం తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.
శ్రీవాస్ తో ఆల్రెడీ లక్ష్యం, లౌఖ్యం సినిమాలు చేశాడు ఆ సినిమాలు హిట్ అందుకున్నాయి మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.







