పల్నాడు జిల్లా దుర్గి మండలంలో పులి సంచారం కలకలం సృష్టించింది.గజాపురంలో ఆవుపై దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ప్రజలు ఎవరూ రాత్రి సమయాలలో ఒంటరిగా తిరగవద్దని ప్రజలకు సూచించారు.కాగా పులి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.







