శాకుంతలం సినిమా ఫలితం చాలా బాధ కలిగించింది... నటి షాకింగ్ కామెంట్స్!

దర్శకుడు గుణశేఖర్(Gunasekhar) దర్శకత్వంలో సమంత (Samantha)ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం(Shaakuntalam).ఓ అద్భుతమైన దృశ్య కావ్యం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది.ఈ సినిమాపై దర్శకనిర్మాతలు ప్రేక్షకులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేదని చెప్పాలి.ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో మేనక పాత్రలో నటించిన నటి మధుబాల (Madhu Bala)మొదటిసారి ఈ సినిమా పరాజయంపై నటించారు.

 Shakunthalam Movie Result Was Very Sad Actress Shocking Comments , Madhu Bala, S-TeluguStop.com

ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ.ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలందరూ ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం నాకు చాలా బాధ కలిగించిందని మధుబాల వెల్లడించారు.ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనప్పటి నుంచి సినిమా విడుదల అయ్యే వరకు ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు.ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలని భావించారు.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎవరికి ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ప్రశాంతంగా షూటింగ్ జరిగిందని తెలిపారు.

పురాణ కథలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు.బాహుబలి, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.మంచి విజయాలు అందుకున్నాయి.

ఇలా ఈ సినిమాలు విజయం కావడానికి సరైన కారణాలు ఏవి లేవని చెప్పాలి.కానీ మా సినిమా మాత్రం ఇలా తీవ్రంగా అందరిని నిరాశ పరుస్తుందని అసలు ఊహించలేదు అంటూ ఈ సందర్భంగా మధుబాల శాకుంతలం సినిమా పరాశయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube