అప్పుడు నెగిటివ్ కామెంట్లు చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు.. ఉపాసన గ్రేట్ అంటూ?

మెగా కోడలు ఉపాసన( Upasana ) మంచి మనిషిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.వ్యాపారాలతో ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాలకు ఆమె ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.

 Ram Charan Wife Upasana Great In That Matter Details Here Goes Viral , Upasana-TeluguStop.com

అయితే చరణ్ ఉపాసనలకు పెళ్లైన తొలినాళ్లలో ఆమె గురించి వచ్చిన ట్రోల్స్ అన్నీఇన్నీ కావు.ఆమె లుక్స్ గురించి, బరువు గురించి ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది.

కొంతమంది నెటిజన్లు అయితే హద్దులు దాటి విమర్శలు చేశారు.ఈ కామెంట్లు తన దృష్టికి కూడా రావడంతో ఉపాసన స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.అయితే ఉపాసన గత కొన్నేళ్లలో తను చేసే పనుల ద్వారా సామాన్య ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.చరణ్( Ram Charan ) కు ప్రతి విషయంలో ఆమె తన వంతు సపోర్ట్ చేస్తున్నారు.

అప్పుడు ఎవరైతే తిట్టారో ఇప్పుడు వాళ్లే ఆమెను ప్రశంసిస్తున్నారు.

కరోనా సమయంలో ఎంతోమందికి ఉపాసన తన వంతు సహాయం చేశారు.మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ఉపాసన వ్యవహరిస్తున్నారు.వివాదాలకు ఉపాసన ఎంతో దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఉపాసన వృత్తిపరమైన పనులతో బిజీ అవుతున్నారనే సంగతి తెలిసిందే.

ఉపాసన ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతే గర్భం దాల్చాలని భావించి ఆలస్యంగా పిల్లల్ని కంటున్నారు.ఉపాసన గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఉపాసన సినిమాల్లోకి వస్తే బాగుంటుందని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఉపాసనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.రామ్ చరణ్ విషయానికి వస్తే గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.బాలీవుడ్, హాలీవుడ్( Bollywood ) సినిమాలలో నటించడానికి రామ్ చరణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

స్టార్ హీరో రామ్ చరణ్ సైతం వివాదాలకు దూరంగా ఉంటూ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube