తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప సినిమా( Pushpa Movie ) తో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా నటుడుగా ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతున్న అల్లు అర్జున్ తనని ట్విట్టర్లో బ్లాక్ చేశారంటూ గతంలో వరుడు సినిమా హీరోయిన్ భాను శ్రీ మెహ్రా ( Bhanu Sri Mehra ) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఈ పోస్టు ద్వారా ఒక్కసారిగా ఈమె వార్తల్లో నిలిచారు.అయితే ఈ పోస్ట్ చేసిన కొంత సమయానికి ఆమె తిరిగి బన్నీ నన్ను అన్ బ్లాక్ చేశారు అంటూ మరొక పోస్ట్ చేశారు.
ఇలా అల్లు అర్జున్ గురించి ఈమె పోస్టులు చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యారు.

తాజాగా అల్లు అర్జున్ నాని( Nani )నటించిన దసరా ( Dasara ) సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ కి భాను శ్రీ రిప్లై ఇస్తూ తన వీడియోని చూడాలంటూ ట్యాగ్ చేశారు.ఇలా ఈ ట్వీట్ చూసినటువంటి అల్లు అర్జున్ అభిమానులు నటి భాను శ్రీ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు.

భాను శ్రీ మెహ్రా ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పలు వీడియోలను చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా తన వీడియోలు చూడాలంటూ తరచూ అల్లు అర్జున్ ను కూడా ట్యాగ్ చేయడంతో తరచూ నోటిఫికేషన్ రావడం వల్లే అల్లు అర్జున్ తనని బ్లాక్ చేసి ఉంటారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అలాగే మరికొందరు నీకు అసలు బుద్ధుందా… మా హీరోకి ఏం పని లేదనుకున్నావా… నువ్వు పంపే వీడియోలు చూస్తూ కూర్చోవడానికి… ఆయన వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
నీలా పని లేదనుకున్నావా అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.







