రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో నిన్నటి రోజున కురిసిన అకాల వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి, పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించిన బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ తోట అగయ్య.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక – కిషన్, జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహారెడ్డి, మండల అధికారులు, గ్రామ ప్రజలు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు