'రామబాణం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్.. క్లారిటీ ఇచ్చిన గోపీచంద్!

మ్యాచో స్టార్ గోపీచంద్ ( Gopichand ) ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు.అయితే ఇప్పటికి వరుస సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు.

 Prabhas To Grace The Pre-release Event Of Gopichand's ramabanam, Prabhas, Sal-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈయన హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.అందుకే ఒక్క హిట్ కోసం గోపీచంద్ పరితపిస్తున్నాడు.

మరి ప్రస్తుతం గోపీచంద్ లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో పని చేస్తున్నాడు.గోపీచంద్ కెరీర్ లో ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ రేంజ్ లో మరో హిట్ అందుకోలేక పోయాడు.అందుకే ఈసారి ఎలాగైనా సరే హిట్ అందుకోవాలని పరితపిస్తున్నాడు.

Telugu Dimple Hayati, Lakshyam, Loukyam, Prabhas, Ramabanam, Sriwass, Tollywood-

డైరెక్టర్ శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ”రామబాణం” ( Ramabanam ).ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆడియెన్స్ ను అలరించాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్దీ ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది.వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ హడావిడి చేస్తున్నారు.

Telugu Dimple Hayati, Lakshyam, Loukyam, Prabhas, Ramabanam, Sriwass, Tollywood-

అయితే ఈ సినిమా కోసం గోపీచంద్ స్నేహితుడు ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నాడు అని నిన్నటి నుండి నెట్టింట వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ రూమర్స్ పై గోపీచంద్ స్పందిస్తూ.ఎంత స్నేహితుడు అయిన కూడా పాన్ ఇండియా హీరోగా వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్న తనని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదని.అందుకే ప్రభాస్ ఈ ఈవెంట్ కు రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

Telugu Dimple Hayati, Lakshyam, Loukyam, Prabhas, Ramabanam, Sriwass, Tollywood-

దీంతో ముందు నుండి వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా ప్రభాస్ ( Prabhas ) వస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్న నేపథ్యంలో రావడం లేదని చెప్పి ఈ రూమర్స్ కు క్లారిటీ ఇచ్చాడు.కానీ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా నిరాశ చెందారు.ఇదిలా ఉండగా రామబాణం సినిమాను మే 5న సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తుండగా.

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. డింపుల్ హయతి ( Dimple Hayati ) హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube