అక్కినేని అఖిల్( Akkineni Akhil ) హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ( Agent Movie ) మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ అఖిల్ కోరుకున్న భారీ విజయాన్ని అందించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఏజెంట్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అఖిల్ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.తన వ్యక్తిగత జీవితం గురించి, సినిమాల గురించి అఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను కాంబినేషన్లను నమ్మనని కథలను నమ్ముతానని అఖిల్ పేర్కొన్నారు.స్టార్ డైరెక్టర్లతో పని చేయడం ఇష్టమే కానీ అలాంటి ప్రతిపాదనలు దర్శకుల వైపు నుంచి రావాలని అఖిల్ చెప్పుకొచ్చారు.“అఖిల్” మూవీ( Akhil Movie ) ఆశించిన ఫలితాన్ని అందుకోని సమయంలో ఒకటి రెండు రోజుల పాటు గదిలో ఒంటరిగా ఉండిపోయానని ఆయన కామెంట్లు చేశారు.ఆ సినిమా ఫలితం తనను నిరాశకు గురి చేయడం వాస్తవమేనని అఖిల్ పేర్కొన్నారు.

నాన్నతో కెరీర్ కు సంబంధించి ఎప్పుడూ గొడవ పడలేదని నాన్న, నేను ఫ్రెండ్స్ లా ఉంటామని అఖిల్ కామెంట్లు చేశారు.తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఏజెంట్ సినిమా తీశామని అఖిల్ చెప్పుకొచ్చారు.భయం లేకుండా పని చేయాలని ఫిక్స్ అయ్యానని ఎక్స్ ట్రీమ్ ప్రయోగం చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవడం సాధ్యమేనని ఆయన కామెంట్లు చేశారు.

తాను ఎక్కడ తప్పు చేశాననే ఆత్మ విమర్శ తరచూ చేసుకుంటానని అఖిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇతరులకు తనలో మంచి కనిపిస్తే అది ఆత్మ విమర్శ నుంచి వచ్చిందేనని అఖిల్ వెల్లడించారు.సినిమా బాగుండి తాను ఫిట్ కాలేదని ఎవరైనా చెబితే మాత్రం అది తన తప్పే అవుతుందని అఖిల్ అన్నారు.
అఖిల్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.







