పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేస్తున్న అన్ని సినిమాలపై ఆయన ఫ్యాన్స్ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.ఈయన లైనప్ లో ప్రస్తుతం ఐదారు పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి.
అన్నిటిని ఒక్కోటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.అన్ని కూడా భారీ ప్రాజెక్టులే కావడంతో ఫ్యాన్స్ ప్రతీ సినిమాపై హోప్స్ పెంచేసుకుంటున్నారు.

మరి ఈయన లైనప్ లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ‘‘ఆదిపురుష్” ( Adipurush ).మొదటిసారి ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న ప్రాజెక్ట్ ఇది.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది.ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు.ఇక బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.జూన్ 16న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసి వరుస అప్డేట్ లను అందిస్తున్నారు.

మరి తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ( Adipurush Trailer ) గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.బాలీవుడ్ లో వైరల్ అవుతున్న క్రేజీ బజ్ ప్రకారం.మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను సుమారు 3 నిముషాల 22 సెకండ్స్ ఉండేలా కట్ చేసారని ఆ ట్రైలర్ అంతా నెక్స్ట్ లెవల్లో అని అంటున్నారు.3డి వర్షన్ లో థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వస్తుంది.మరి ఈ ట్రైలర్ పై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.
.






