అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమా వచ్చి మూడు సంవత్సరాలు దాటింది.ఈ మూడు సంవత్సరాల్లో హీరోయిన్ పూజ హెగ్డే ( Pooja Hegde )చాలా సినిమాల్లోనే నటించింది.
కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమె కు సక్సెస్ ని తెచ్చి పెట్టలేక పోయాను.ముఖ్యంగా గత ఏడాది ప్రభాస్ తో రాధేశ్యామ్, చిరంజీవి సినిమా లో రామ్ చరణ్ కి జోడిగా ఆచార్య ఇంకా మూడు నాలుగు సినిమాల్లో నటించిన పూజ హెగ్డే ఏ ఒక్క సినిమా తో సక్సెస్ ని సొంతం చేసుకోలేక పోయింది.
దాంతో ప్రభాస్ ( Prabhas )పూజా హెగ్డే పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.

తాజాగా బాలీవుడ్ సినిమా లో కూడా పూజ హెగ్డే కి నిరాశ మిగిలింది.సల్మాన్ ఖాన్ తో నటించిన సినిమా అవడంతో పూజ హెగ్డే చాలా నమ్మకంగా కనిపించింది… కానీ ఆమె టైం సరిగా లేనట్లుంది.దాంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
హిందీ లో సినిమా ఆఫర్స్ కనిపించడం లేదు.తమిళం లో కూడా ఈమెను పట్టించుకోవడం లేదు.
తెలుగు లో మాత్రం అడపాదడపా ప్రస్తుతం ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా రూపొందుతున్న సినిమాలో మాత్రమే పూజ హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సంవత్సరం లో పూజా హెగ్డే కొత్త సినిమాలు ఏవి వచ్చే పరిస్థితి లేదు.

మధ్యలో ఏమైనా ఐటెం సాంగ్స్ చేసే తప్పితే పూజా హెగ్డే నుండి ఈ సంవత్సరంలో కొత్త సినిమాలు వచ్చే పరిస్థితి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.మహేష్ బాబు సినిమా కూడా ఈమె కెరియర్ ని గాడిలో పడేస్తుందా అంటే అనుమానమే అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.ఎందుకంటే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఈమెకు పెద్దగా ప్రాముఖ్యత బట్టి అవకాశం లేదు.
ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా శ్రీ లీలా కనిపించబోతోంది.కనుక పూజా హెగ్డే పరిస్థితి కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది.ఆ పాత్ర గుర్తింపు వస్తే కెరియర్లో మరో నాలుగు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







