గొర్రె పిల్లతో మేనేజ్ చేయాలని చూశారు, కానీ కుక్క పిల్ల డ్రగ్స్ పట్టేసుకుందిలా!

స్మగ్లర్లు ( Smugglers )అనేవారి బ్రెయిన్ ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఎవరూ పసిగట్టలేరు.వారికి తోచిన మార్గాల్లో డ్రగ్స్ ( Drugs ) అనేదానిని స్మగ్లింగ్ చేస్తుంటారు.

 Scotland Couple Carrying Lamb And Drugs Worth Rs 10 Lakh Caught Details, Viral L-TeluguStop.com

అయితే ఎంత జాగ్రత్తగా డ్రగ్స్ సరఫరా చేసినా, ఎక్కడో ఓ చోటు వారి పాపం పండి దొరికిపోతుంటారు.తాజాగా న్యూజిలాండ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఓ వృద్ద దంపతులు అడ్డంగా బుక్కైపోయారు.

గొర్రెపిల్ల ( Lamb ) సాయంతో 10 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.ఈ జంట 10 లక్ష విలువైన డ్రగ్స్‌తో ఓ గొర్రెపిల్లను కారులో తీసుకెళ్లారు.

ఏప్రిల్ 22న స్కాంట్లాండ్ లోని( Scotland ) ఎం74 హైవేపై సదరు వృద్ధ దంపతులు కారులో వెళ్తుండగా పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కారు వెనుక సీటులో గొర్రెపిల్ల కనిపించింది.ఆ వృద్ద దంపతులు గొర్రె పిల్లతో ఆడుకోవడాన్ని పోలీసులు గమనించారు.ఆ పక్కనే చిప్స్ ప్యాకెట్ కూడా కనిపించింది.కానీ పోలీసులతో ఉన్న కుక్క పదేపదే కారు వెనుకసీటునే అనుమానంగా చూడడంతో మొదట గొర్రెపిల్లపై కుక్క దాడి చేస్తుందని భావించిన పోలీసులు, ఆ తరువాత దంపతులపై అనుమానం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో వెనుక సీటును తనిఖీ చేయగా.10 లక్షల విలువైన డ్రగ్స్ ప్యాకెట్ దొరికింది.దాంతో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వృద్ధ దంపతులను స్పాట్లోనే అరెస్ట్ చేశారు.వీరి నుంచి 7 లక్షల విలువైన హెరాయిన్, 3 లక్షల విలువైన కొకైన్ పట్టుకున్నారు.

కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు ఆన్‌లైన్‌లో వెల్లడించారు.ఈ దంపతులు గొర్రెపిల్ల ఆధారంగా ఒక మిలియన్ విలువైన డ్రగ్స్ ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారో వారు వివరించారు.

వాహనాల తనిఖీ సమయంలో పోలీస్ జాగిలం లేకపోతే ఈ స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి తమ డ్రగ్స్ ను యధేచ్చగా సరఫరా చేసేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube