గొర్రె పిల్లతో మేనేజ్ చేయాలని చూశారు, కానీ కుక్క పిల్ల డ్రగ్స్ పట్టేసుకుందిలా!
TeluguStop.com
స్మగ్లర్లు ( Smugglers )అనేవారి బ్రెయిన్ ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఎవరూ పసిగట్టలేరు.
వారికి తోచిన మార్గాల్లో డ్రగ్స్ ( Drugs ) అనేదానిని స్మగ్లింగ్ చేస్తుంటారు.
అయితే ఎంత జాగ్రత్తగా డ్రగ్స్ సరఫరా చేసినా, ఎక్కడో ఓ చోటు వారి పాపం పండి దొరికిపోతుంటారు.
తాజాగా న్యూజిలాండ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఓ వృద్ద దంపతులు అడ్డంగా బుక్కైపోయారు.
ఓ గొర్రెపిల్ల ( Lamb ) సాయంతో 10 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
ఈ జంట 10 లక్ష విలువైన డ్రగ్స్‌తో ఓ గొర్రెపిల్లను కారులో తీసుకెళ్లారు.
"""/" /
ఏప్రిల్ 22న స్కాంట్లాండ్ లోని( Scotland ) ఎం74 హైవేపై సదరు వృద్ధ దంపతులు కారులో వెళ్తుండగా పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కారు వెనుక సీటులో గొర్రెపిల్ల కనిపించింది.
ఆ వృద్ద దంపతులు గొర్రె పిల్లతో ఆడుకోవడాన్ని పోలీసులు గమనించారు.ఆ పక్కనే చిప్స్ ప్యాకెట్ కూడా కనిపించింది.
కానీ పోలీసులతో ఉన్న కుక్క పదేపదే కారు వెనుకసీటునే అనుమానంగా చూడడంతో మొదట గొర్రెపిల్లపై కుక్క దాడి చేస్తుందని భావించిన పోలీసులు, ఆ తరువాత దంపతులపై అనుమానం వ్యక్తం చేశారు.
"""/" /
ఈ క్రమంలో వెనుక సీటును తనిఖీ చేయగా.10 లక్షల విలువైన డ్రగ్స్ ప్యాకెట్ దొరికింది.
దాంతో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వృద్ధ దంపతులను స్పాట్లోనే అరెస్ట్ చేశారు.
వీరి నుంచి 7 లక్షల విలువైన హెరాయిన్, 3 లక్షల విలువైన కొకైన్ పట్టుకున్నారు.
కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు ఆన్‌లైన్‌లో వెల్లడించారు.ఈ దంపతులు గొర్రెపిల్ల ఆధారంగా ఒక మిలియన్ విలువైన డ్రగ్స్ ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారో వారు వివరించారు.
వాహనాల తనిఖీ సమయంలో పోలీస్ జాగిలం లేకపోతే ఈ స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి తమ డ్రగ్స్ ను యధేచ్చగా సరఫరా చేసేవారు.
ప్రార్ధనా స్థలాల వద్ద నిరసనలపై నిషేధం .. కెనడాలోని రెండు సిటీ కౌన్సిల్స్ తీర్మానం