భారత రాజధాని ఢిల్లీలో ( Delhi ) పట్టపగలే దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.ఇండియాకి క్యాపిటల్‌గా మాత్రమే కాదు ఇది అనేక దారుణాలతో క్రైమ్ క్యాపిటల్‌గా మారుతోంది.
ఏప్రిల్ 24న జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇందులో ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు( Masked Men ) రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పలు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఈ షాకింగ్ ఘటన సిద్ధార్థ్ నగర్( Sidharth Nagar ) ప్రాంతంలో చోటు చేసుకుంది.సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కాల్పుల ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హిప్నోథెరపిస్ట్ సోహైల్ సిద్ధిఖీకి చెందిన మొదటి అంతస్తులోని అపార్ట్మెంట్ తలుపు వద్దకు నిందితులు వచ్చారు.ఆపై సోహైల్ తలుపు ఘడియాన్ని చాలాసేపు కొట్టాడు.తర్వాత ఒక నిందితుడు కొన్ని మెట్లు దిగి తలుపు వైపు పిస్తోల్ గురి పెట్టాడు.అనంతరం రెండుసార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి కిందకు పారిపోయాడు.కింది అంతస్తులోని మరో అపార్ట్మెంట్లోని కిటికీపై మూడుసార్లు కాల్పులు జరిపాడు.అనంతరం ఎవరికీ దొరక్కుండా ఇంకో నిందితుడుతో కలిసి అక్కడి నుంచి ఉడాయించాడు.
దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నిందితులు టార్గెట్ చేసిన అపార్ట్‌మెంట్‌ను హిప్నోథెరపిస్ట్ అద్దెకు తీసుకోవడం జరిగింది.అయితే అతనితోపాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా కాల్పులు జరుపుతున్న సమయంలో గాయపడలేదని సమాచారం.
కాగా పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.వారిని విచారించి, ఎందుకు కాల్పులు జరిపారో తెలియజేస్తామని కూడా స్పష్టం చేశారు.