ఓపెన్ఏఐ తీసుకొచ్చిన చాట్‌జీపీటీ( chatgpt ), గూగుల్ పరిచయం చేసిన బార్డ్, మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిన బింగ్ వంటి ఏఐ చాట్‌బాట్లు ఇంటర్నెట్( AI chatbots ) ప్రపంచాన్ని ఏలుతున్నాయి.వీటిని యూజర్లు వివిధ ప్రయోజనాలకు విరివిగా వాడుతున్నారు.
ఈ క్రమంలో ఏఐతో పెద్ద ప్రమాదం పొంచి ఉందని మేధావులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ( Bill Gates )ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రిస్క్‌ల గురించి ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాసారు.
ఇందులో ఏఐ గురించి ఆయన పేర్కొంటూ ఏఐ మానవులకు అంతిమంగా ప్రయోజనమే చేకూరుస్తుందని అన్నారు.ఏఐ చాట్‌బాట్‌లు భవిష్యత్తులో విద్యార్థులకు బోధించడంలో సహాయపడతాయని, అవి మానవ టీచర్ల వలె సమర్థవంతంగా మారతాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశాక భవిష్యత్తులో ఏఐ బాట్స్ స్కూళ్లకు వచ్చి పాఠాలు చెబుతాయా అనే సందేహాలు మొదలయ్యాయి.

ఏఐ చాట్‌బాట్లు పిల్లలు కేవలం 18 నెలల కంటే తక్కువ సమయంలో చదవడం నేర్చుకునేలా హెల్ప్ చేస్తాయని కూడా గేట్స్ అభిప్రాయపడ్డారు.ఏఐ బాట్స్ చదవడం, రాయడంలో నిష్ణాతులుగా ఉంటాయని, తద్వారా అవి విద్యార్థులలో చదవడం, రాయడం వంటి స్కిల్స్‌ను మెరుగుపరచడంలో గొప్పగా సహాయపడతాయని బిల్ గేట్స్ అన్నారు.ఏఐ చాట్‌బాట్‌లు ట్యూటర్‌గా కూడా పని చేస్తాయని, విద్యార్థి రాసిన రాతపై ఫీడ్‌బ్యాక్ అందిస్తాయని పేర్కొన్నారు.
ఆపై విద్యార్థుల గణిత నైపుణ్యాలకు పదును పెట్టడంలోనూ ఏఐ బాగా దోహదపడుతుందని చెప్పుకొచ్చారు.

ప్రపంచంలోని చెత్త అసమానతలను తగ్గించడం, విద్యా రంగాన్ని మార్చడం, పిల్లలు నేర్చుకునే విధానాన్ని మార్చడం, ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడం, కార్యాలయాల్లో ఉద్యోగుల ప్రొడక్టివిటీని పెంచడం వంటి కొన్ని ఏఐ ఉపయోగాలను కూడా గేట్స్ ప్రస్తావించారు.ఏఐ వల్ల ప్రయోజనాలే కాదు ప్రమాదాలు కూడా ఉన్నాయన్నారు.అయితే ఇప్పటివరకు చేసిన పురోగతులు ఏవీ భౌతిక ప్రపంచాన్ని నియంత్రించగల, దాని సొంత లక్ష్యాలను ఏర్పరచుకోగల బలమైన ఏఐని తీసుకురాలేదని తెలిపారు.







