టిఆర్ఎస్ బీఆర్ఎస్( Brs party ) గా పేరు మాత్రమే మారిందని, డీఎన్ఏ మారలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్( K.T.Rama Rao ) అన్నారు .ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ప్లీనరీ పార్టీ ఆవిర్భావ సభ( Rajanna Sircilla )లో కేటీఆర్ ప్రసంగించారు.పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి భారీగా బి.ఆర్.ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా కేటీఆర్ అనేక అంశాలపై మాట్లాడారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతం అని కేసిఆర్ పై రాష్ట్రపతి ఆనాడు ఎంతో గొప్పగా చెప్పారని కేటీఆర్ అన్నారు.
ఆనాడు గులాబీ జెండా ఎగురవేసే సమయంలో కేసీఆర్ సాధారణ వ్యక్తి అని ,.తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్ ఎత్తుకున్నారని అన్నారు.ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని 1969 లో ప్రొఫెసర్ జయశంకర్( Professor Jayashankar ) చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు .

30 ఏళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం మొదలుపెట్టారని, తప్పు చేసినా ఎత్తిన జెండా దించినా తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టి చంపండి అని మొట్టమొదటి సింహగర్జనలో కేసీఆర్ చెప్పారు అనే విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.రాష్ట్రం , కేంద్రం బాగుపడాలంటే ఎవరి పని వారు చేయాలని, 2010 నుంచి 14 వరకు గుజరాత్ లో జరగని అభివృద్ధి జరిగిందని చెప్పి నరేంద్ర మోది పీఎం అయ్యారని , మహారాష్ట్రలో రైతులు కేసీఆర్ వెంట ఉన్నారని కేటీఆర్ అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోది రైతులను పట్టించుకోవడంలేదని కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ , బిజెపిలను తప్పకుండా ప్రజలు బండ కేసి కొడతారని, కెసిఆర్ కాలిగోటికి సరిపోయే నాయకుడు ఎవరూ లేరని, బ్రెయిన్ లేని బండి, పార్టీలు మారే వారితో కేసీఆర్ పోటీపడాలా అని కేటీఆర్ ప్రశ్నించారు.అన్ని వర్గాలు , అన్ని కులాలు అన్ని మతాలవారు కేసీఆర్ పాలనలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. ఇది ఎన్నికల ఏడాది కనుక చిన్న పామునైన పెద్ద కట్టెతోనే కొట్టాలని , తనను మీరు దయతో 89 వేల కోట్ల మెజారిటీతో గెలిపించారని, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ గుర్తు చేశారు .మతం పేరు మీద విచిత్ర ఎంపీని తెచ్చుకున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు చేశారు.







