హనీ రోజ్.( Honey Rose ) వీర సింహ రెడ్డి విడుదల అయ్యి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడ ఆమె ప్రభావం తగ్గడం లేదు.
తెలుగు ప్రేక్షకులను తన భారీ అందాలతో ఫిదా చేయడం లో సూపర్ సక్సెస్ అయ్యింది.ఇక తెలుగు లో ఆమె మొదటి సినిమా వీర సింహ రెడ్డి( Veerasimha Reddy ) అని అందరు అనుకుంటారు కానీ 2008 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం లో శివాజీ హీరో గా నటించిన ఆలయం చిత్రంలో( Aalayam Movie ) మొదటి సారి హీరోయిన్ గా నటించింది.
ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరో గా నటించిన ఈ వర్షం సాక్షిగా చిత్రంలో కూడా ఆమె ఒక పాత్రలో నటించింది.
ఇక ఇప్పుడు తెలుగు లో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చింది బాలయ్య బాబు( Balakrishna ) వీర సింహ రెడ్డి తో.ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీ లో దాదాపు సెటిల్ అయినట్టే అని అందరు అనుకుంటున్నారు.అందరు ఊహించినట్టుగానే ఆమె ఎక్కువ హైదరాబాద్ లోనే కనిపిస్తుండటం విశేషం.
ఇక ఈ కేరళ చిన్నదాన్ని అందరు ముద్దుగా పొన్ను అని పిలుస్తారట.ఈమె వయసు 33 ఏళ్ళు.
ఇంకా కెరీర్ లో సెటిల్ కాలేదు అనే ఒక్క రీజన్ తో పెళ్లి కూడా చేసుకోలేదు.

అయితే ఒక్కో సినిమాకు 20 లక్షలు మాత్రమే తీసుకునున్న హాని రోజ్ఇన్నేళ్ల కెరీర్ లో పెద్దగా కూడబెట్టింది ఏమి లేదు.ఆమెకు 2 కోట్ల మేర నెట్ వర్త్ ఉండటం విశేషం.ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా షాప్ ఓపెనింగ్స్ చేసి బాగానే కూడబెడుతుంది.
హాని రోజ్ ఎక్కువగా ఆమె మొదట కొన్న ఇన్నోవా కారు నే వాడుతూ ఉంటుంది.ఇక అది మాత్రమే కాకుండా ఆమె దగ్గర నిస్సాన్ సన్నీ కారు కూడా వుంది.

ఇక తల్లిదండ్రుల నుంచి వచ్చిన విల్లా తో పాటు ఆమె కష్టపడి సొంతంగా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ని కొనుగోలు చేసింది.ఆమె ఎక్కువగా తన సొంత ఫ్లాట్ లోనే ఉంటుంది.తల్లిదండ్రులకు హనీ రోజ్ ఒక్కగానొక్క కుమార్తె.దాంతో ఆమెకు ఆర్థికంగా ఎలాంటి డోకా లేదు.కెరీర్ కూడా ఇప్పుడు తెలుగు తో పాటు సౌత్ ఇండియాలో బాగానే పుంజుకుంది.ఈ ఏడాది వీరసింహ రెడ్డి తో పాటు పూక్కాలం అనే మరొక సినిమాను లో కూడా నటించింది.
ఏ కారాణాల చేతనో తెలియదు కానీ ఆమె ఇప్పటి వరకు మరొక సినిమాను అంగీకరించలేదు.







