శ్రీ సత్య సాయి జిల్లాలోనిప్రసిద్ధి పుణ్యక్షేత్రం లేపాక్షి లోని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి దేవాలయం ను ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ విశేషాలను పూజారులను అడిగి తెలుసుకున్నారు పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శ్రీకాంత్ దంపతులకు సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని విథురాసత్వం సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీకాంత్ దంపతులు అక్కడ నాగుల విగ్రహాలను ప్రతిష్ట చేశారు .ఈ రోజున మండల పూజ ఉండడంతో పూజా కార్యక్రమంలో ముగించుకొని లేపాక్షి వచ్చి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించి అనంతరం హైదరాబాద్ వెళ్ళిపోయారు







