స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) మూడు పదుల వయస్సులో కూడా అందంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.సమంత వయస్సు ప్రస్తుతం 35 సంవత్సరాలు కాగా యంగ్ జనరేషన్ హీరోయిన్లకు ఆమె గట్టి పోటీ ఇస్తున్నారు.ఏప్రిల్ 28వ తేదీన సమంత పుట్టినరోజు కాగా ఆరోజు సమంత సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.15 ఏళ్ల క్రితం సమంత సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది.

ఏ మాయ చేశావె సినిమా నుంచి శాకుంతలం( Sakunthalam ) వరకు ప్రతి సినిమాతో సమంత ప్రేక్షకులను మాయ చేస్తోంది.ప్రత్యూష ఫౌండేషన్ ( Pratyusha Foundation )ద్వారా సమంత పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.పలు వ్యాపారాలలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సమంత ఆ వ్యాపారాల ద్వారా సైతం కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారని సమాచారం అందుతోంది.సమంత తాజాగా 16 సంవత్సరాల వయస్సులో దిగిన ఫోటోను పంచుకున్నారు.

ఆ ఫోటోను చూసిన నెటిజన్లు సమంత అభిమానులు సామ్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు.సమంత 16 సంవత్సరాల వయస్సులో మరింత క్యూట్ గా ఉన్నారని మరి కొందరు చెబుతున్నారు.కొంతమంది నెటిజన్లు మాత్రం సమంత అప్పుడూ అందగత్తెనే ఇప్పుడూ అందగత్తెనే అని కామెంట్ చేయడంతో పాటు ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.

యశోద మూవీ( Yashoda Movie )తో సక్సెస్ సాధించిన సమంత శాకుంతలం సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో పాటు సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న సమంత ఈ రెండు ప్రాజెక్ట్ లు తన కెరీర్ లో స్పెషల్ గా ఉంటాయని చెబుతున్నారు.సమంత మళ్లీ వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో బిజీ కావాలపై తన గురించి విమర్శలు చేసిన వాళ్లకు ధీటుగా బదులివ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







