ఇకపై ఆటోలలో కూడా సీటు బెల్ట్స్ ధరించాలి... ఇవిగో రూల్స్!

అదేంటి, ఆటోలలో( autos ) కూడా సీటు బెల్ట్స్( Seat belts ) ధరించాలా అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే.ఫేమస్ ఆటో రెంట్ కంపెనీ రాపిడో( Rapido ) ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం.

 From Now On Even In Autos Seat Belts Must Be Worn Here Are The Rules , Auto, Sea-TeluguStop.com

అవును, తమ రెంట్ ఆటోలలో ప్రయాణించే వారి కోసం సీట్ బెల్ట్ లను ఫిక్స్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.ఈ క్రమంలోనే బెంగళూరులో మొదటగా ఈ సౌకర్యాన్ని రాపిడో అమలు చేసింది.

నిత్యం రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.

Telugu Auto, Latest, Rapido, Seat Belt-Latest News - Telugu

ఇకపోతే సీట్ బెల్ట్స్ వలన ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో మనందరికీ తెలిసిందే.ఆటో ఆకస్మాత్తుగా ఆగిపోవడం లేదా ఢీకొన్న సందర్భాల్లో ఇవి బాగా ఉపయోగపడతాయి.అదేవిధంగా తీవ్రమైన ప్రమాదాలలో గాయాలను, మరణాలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

వీటితో పాటు ప్రయాణీకుల భద్రత కోసం తన కంపెనీ హైర్ చేసుకున్న డ్రైవర్ కెప్టెన్ల వివరాలను ఫోర్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా వెరిఫై చేస్తుంది.దీంతో ఈజీగా వారిని ట్రాక్ చేయడంతో పాటు సకాలలంలో స్పందించేలా సిస్టమ్ ని రాపిడో కంపెనీ కలిగి ఉంది.

Telugu Auto, Latest, Rapido, Seat Belt-Latest News - Telugu

దీంతో పాటు ముఖ్యంగా మహిళా రైడర్‌ల కోసం, వారి గోప్యత ఇంకా గుర్తింపు వంటి సేఫ్టీ మెజర్స్ ని కలిగిన ప్రత్యేక ఇన్ఫర్మేషన్-మాస్కింగ్ ఫీచర్‌ను కూడా వాడుతోంది.అదేవిధంగా యాప్ లోని లైవ్ ట్రాకింగ్ తో డేటాను యాక్సెస్‌ చేయనుంది.ఎమర్జెన్సీ ఫీచర్స్ ఇంకా చాలా అధునాతన సౌకర్యాలను యాప్ లో కల్పించింది.దీని ద్వారా రైడర్ హ్యాపీగా తన ప్రయాణాన్ని సాగిస్తాడని రాపిడో కంపెనీ తెలుపుతోంది.ర్యాపిడో యాప్ సేఫ్టీ ఫీచర్ల ద్వారా ప్రయాణీకులు తమ రైడ్ లో సురక్షిత ప్రయాణాన్ని పొందుతారని రాపిడో ఆటో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube