అక్కినేని అఖిల్ ( Akhil )తాజాగా ఏజెంట్ సినిమా (Agent Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదలకు భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
సురేందర్ రెడ్డి ( Surender Reddy ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ స్పై చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.మొదట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల చేయాలని భావించిన ఫైనల్ కాపీ తయారు కాకపోవడంతో పాన్ ఇండియా రిలీజ్ విరమించుకున్నారు.
ఇక ఈ సినిమా కోసం అఖిల్ సైతం భారీ స్థాయిలో కష్టపడ్డారని తెలుస్తుంది.ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమా గురించి నిర్మాత అనిల్ సుంకర ( Anil Sunkara ) పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చయిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు ఒక్కసారైనా హిట్ లేనటువంటి అఖిల్ ను నమ్మి ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టి నిర్మాత రిస్క్ చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.అయితే ఈ సినిమా నిర్మాణంలో అఖిల్ కూడా భాగస్వామ్యం అయ్యారనే విషయాన్ని అనిల్ సుంకర వెల్లడించారు.

అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారని తెలియజేశారు.ఇలా నిర్మాణంలో అఖిల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా భాగస్వామ్యం కావడంతో వీరి రెమ్యూనరేషన్ తీసుకోకుండా దానిని ఈ సినిమాకి పెట్టుబడిగా పెట్టి సినిమా చేశారని ఈయన తెలియచేశారు.ఇలా అఖిల్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ సినిమా చేశారని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఓ రకంగా ఈ ఇద్దరు భారీ రిస్క్ చేశారనీ చెప్పాలి.
ఈ సినిమా నిర్మాణంలో అఖిల్ సురేందర్ రెడ్డి కూడా భాగస్వామ్యం కావడంతో ఈ విషయంలో నిర్మాత అనిల్ సుంకర కొంత రిలీఫ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.







