యాంత్రికమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను( Software Jobs ) పక్కన బెట్టి వ్యవసాయ రంగం వైపు మళ్ళిన చాలా మంది గురించి మనం విన్నాం.అదేవిధంగా మంచి ఫలితాలు సాధించిన వ్యక్తుల సక్సెస్ స్టోరీలు కూడా చదివాం.
అయితే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం వదిలేసి, వ్యవసాయం చేయడానికి ఏకంగా జపాన్ ( Japan )వెళ్లిన యువకుడి ఉదంతం గురించి తెలుసుకుందాం.అవును, మీరు విన్నది నిజమే.
జపాన్‌లోని అధునాతన వ్యవసాయ పద్ధతులను ఇండియాలో రైతులకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఉన్న యువకుడి వివరాలు గురించి ఇపుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టికి చెందిన వెంకటసామి విఘ్నేష్( Venkatasamy Vignesh ) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసేవాడు.రెండు చేతులనిండా మంచి సంపాదన.అయితే అతను వ్యవసాయంపై మక్కువతో చెన్నైలోని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసాడు.
లాక్‌డౌన్ సమయంలో ఇంటి వద్దనే ఉండి తమ పొలాల్లో వ్యవసాయ పనులు చేశాడు.ఆ సమయంలో తనకు ఆసక్తి ఉన్న రంగం వ్యవసాయమని గుర్తించి, ఇందులోనే కొనసాగాలని భావించాడు.
ఆ తర్వాత విఘ్నేష్ జపాన్‌లో నిహాన్ ఎడ్యుటెక్ అనే సంస్థ ద్వారా జపాన్‌లో వంకాయల పెంపకంలో పని చేసే అవకాశాన్ని పొందాడు.
మార్చిలో, విఘ్నేష్ జపాన్‌లోని కొచ్చి ప్రిఫెక్చర్‌లోని వంకాయల ఫారమ్( Eggplant farm )లో వ్యవసాయ కార్మికుడిగా పని ప్రారంభించాడు.ప్రస్తుతం మునుపటి జీతం కంటే రెండింతలు అతగాడు అక్కడ సంపాదిస్తున్నాడు.అతని పని ఏమిటంటే… పంటలను జాగ్రత్తగా చూసుకొని, వాటిని కోయడం, శుభ్రపరచడం, ప్రాసెసింగ్‌లో సహాయం చేయడం.
విఘ్నేష్ జపాన్‌లో తన అనుభవాన్ని, భారతదేశంలో వినూత్న వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడానికి ఉపయోగించాలని యోచిస్తున్నాడు.జపాన్‌లో రైతులకు డిమాండ్ ఉంది.అక్కడ వృద్ధాప్య జనాభా పెరుగుతోంది, వ్యవసాయంపై ఆసక్తి చూపే యువత సంఖ్య తగ్గుతోంది.విఘ్నేష్ వంటి నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రత్యేక అవకాశాలను అందిస్తోంది.