ఉద్యోగం, వ్యాపారం, వైద్యం, ఉన్నత చదువులు… ఇలా కారణం ఏదైనా ఒక్కోసారి మనకు విదేశాలు వెళ్లాల్సిన అవసరం ఏర్పడి ఉంటుంది.ముఖ్యంగా మనదేశం నుండి అమెరికా ( America ) వెళ్లే వాళ్ళ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
దీంతో మన దేశంలో యూఎస్ వీసాలు( US Visa ) త్వరగా అయిపోతూ, లాంగ్ టైమ్ వెయిటింగ్ చేయాల్సి రావడం గమనార్హం.ఇక్కడ కొన్ని నగరాల్లో ఈ వెయిటింగ్ టైమ్ ఒక సంవత్సరం వరకు ఉండటం గమనార్హం.
అయితే ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇండియన్స్ యూఎస్‌కు ఇతర దేశాల నుంచి కూడా వెళ్లవచ్చు.
అవును, మీరు విన్నది నిజం.ఇపుడు B1/B2 వీసాల కోసం కొన్ని ఇంటర్నేషనల్ డెస్టినేషన్ నుంచి సింపుల్‌గా అప్లై చేసుకొనే వీలుంది.ముఖ్యంగా 2 ప్రాంతాల నుంచి కేవలం 2 రోజుల్లోనే వీసా అపాయింట్‌మెంట్ అనేది పొందవచ్చు.
ప్రస్తుతం ముంబైలో B1 (USలో తాత్కాలిక వ్యాపారం కోసం), B2 (USలో పర్యాటకం కోసం) వీసా అపాయింట్‌మెంట్స్ వెయిటింగ్ టైమ్ 386 రోజులుగా ఉండగా న్యూఢిల్లీలో ఈ సమయం 346 రోజులు కాగా, అపాయింట్‌మెంట్ కోసం చెన్నైలో 316 రోజులు, కోల్‌కతాలో 392, హైదరాబాద్‌లో 332 రోజులు వేచి ఉండాల్సి వస్తోంది.
ఈ తరుణంలో వివిధ దేశాల్లో యూఎస్ వీసా వెయిట్ టైమ్( US Visa Wait Time ) ఎలా ఉంటుందో తెలుసుకుందాం.మరీ ముఖ్యంగా కువైట్, జపాన్‌లోని టోక్యో నుంచి యూఎస్ వీసా అపాయింట్‌మెంట్‌ను కేవలం 2 రోజుల్లోనే పొందవచ్చని మీకు తెలుసా? ఏవిధంగా సౌత్ కొరియాలోని సియోల్ నుంచి ఇందుకు 4 రోజులు, కంబోడియాలోని నమ్ పెన్ నుంచి 9 రోజులు, ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి 14 రోజులు, మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి 18 రోజులు, వియత్నాంలోని హనోయి నుంచి 29 రోజుల్లో యూఎస్ వీసా అపాయింట్‌మెంట్ అందుకోవచ్చు.కాబట్టి విదేశాలు వెళ్లాల్సినవారు అక్కడి నుండి ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుందని కొంతమంది చెబుతున్నారు.