పోలీసులపై దాడి కేసులో YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు( YS Sharmila ) నాంపల్లి కోర్టు 14 రోజులపాటు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది.దీంతో మే 8వ తేదీ వరకు ఆమెను రిమాండ్ విధించడం జరిగింది.
కాసేపట్లో షర్మిలను చంచల్ కూడా జైలుకు పంపించనున్నారు.TSPSC పేపర్ లీకేజ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేయటం లేదని ఈరోజు మధ్యాహ్నం సిట్ అధికారులను కలవటానికి లోటస్ పాండ్ లో తన ఇంటి నుంచి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఇదే సమయంలో పోలీసులకు షర్మిలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ పై షర్మిల చేయిచేసుకోవటం పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై పోలీస్ లు ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా… తాజాగా కోర్టు రిమాండ్ విధించింది.షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రిల వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.ఈ క్రమంలో మే 8వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.
దీంతో మే 8వ తేదీ వరకు షర్మిల చర్లపల్లి జైలులో( Charlapally Jail ) ఉండనున్నారు.ఈలోగా షర్మిల బెయిల్ పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.







