ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆన్లైన్ మోసాల గురించి వింటూనే ఉన్నాం.మరొక వైపు ప్రభుత్వం, అధికారులు ఈ ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కల్పిస్తూ హెచ్చరిస్తూ ఉన్నా కూడా అనవసరంగా సైబర్ నేరగాళ్ల( Cybercriminals ) చేతిలో చిక్కుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
కరోనా అనంతరం అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారానే జరుగుతూ ఉండడంతో గాలానికి చేప చిక్కినట్టు.అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు.
మొదట అమాయకులను నమ్మించడం కోసం వారి ఖాతాలో నగదు జమా చేసి, బాధితులు పూర్తిగా నమ్మిన తర్వాత ఖాతాలో ఉండే డబ్బు మొత్తం స్వాహా చేసేస్తున్నారు.ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.

ముంబై( Mumbai ) కు చెందిన ఓ అకౌంటెంట్ పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతూ, జాబ్ కు సంబంధించిన ఓ లింక్ నోటిఫికేషన్స్ పై క్లిక్ చేసింది.అందులో యూట్యూబ్ ఛానల్ లను సబ్ స్క్రైబ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉందని మెసేజ్ లో ఉంది.ఆ మహిళ మెసేజ్ లో ఉండే రెండు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగా ఆమె ఖాతాలో రూ.120 జమ అయ్యాయి.వెంటనే స్కామర్లు ఆమెకు సబ్స్క్రైబ్ చేసిన యూట్యూబ్ ఖాతాల స్క్రీన్ షాట్లను పంపమని అడిగారు.
తర్వాత ఆమెకు ఒక జాబ్ కోడ్ పంపించి, ఆ కోడ్ టెలిగ్రామ్ ఖాతకు పంపాలని కోరారు.ఆమె అలాగే చేసింది.వెంటనే సైబర్ నేరగాళ్లు ఆ మహిళ బ్యాంక్( Woman’s Bank ) వివరాలు అడగి, వరుసగా రెండు రోజులు ఆమె ఖాతాలో డబ్బు జమా చేసి నాలుగు రోజుల తర్వాత వేరువేరు ఖాతాల నుండి ఆమె అకౌంట్లో ఉండే రూ.7,23,889 ను బదిలీ చేసుకున్నారు.ఆ మహిళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో మోసపోయానని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.







