అమెరికాలో భారత సంతతి మహిళా న్యాయవాదికి అరుదైన గౌరవం.. !!

అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళా న్యాయవాదికి అరుదైన గౌరవం దక్కింది.ఇండో అమెరికన్ , ప్రఖ్యాత ఇమ్మిగ్రేషన్ లాయర్ షీలా మూర్తిని( Sheela Murthy ) మే 11న మేరీలాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ … ప్రతిష్టాత్మక మేరీలాండ్ బిజినెస్ హాల్ ఆఫ్ ఫేమ్‌ ఇండక్షన్‌( Maryland Business Hall of Fame )తో సత్కరించనుంది.

 Indian American Lawyer Sheela Murthy Being Inducted Into Maryland Business Hall-TeluguStop.com

ప్రతి ఏడాది మేరీలాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ .ఒక ప్రముఖ వ్యక్తిని సత్కరిస్తూ వస్తోంది.వీరు తమ కృషి, అంకిత భావంతో వ్యాపారాల్లో గొప్ప విజయాలను తీసుకురావడమే కాకుండా వారి సంస్థలను, ఉద్యోగులను , కమ్యూనిటీని సుసంపన్నం చేస్తారని మేరీలాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

Telugu America, Gujarat, Indian American, Maryland Hall, Marylandchamber, Maryla

ఇక షీలా మూర్తి విషయానికి వస్తే.మేరీలాండ్( Maryland ) కేంద్రంగా పనిచేస్తున్న లా సంస్థకు ప్రెసిడెంట్, సీఈవోగా పనిచేస్తున్నారు.మేరీలాండ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో క్రియాశీల సభ్యురాలిగా వున్నారు.

ఇది ఈ రాష్ట్రంలోని వ్యాపార సంస్థలకు న్యాయ సహాయాన్ని కూడా అందిస్తుంది.క్లిష్టమైన పబ్లిక్ పాలసీ సమస్యలపై భాగస్వాముల కూటమితో ఈ సంస్థ కలిసి పనిచేస్తుంది.

Telugu America, Gujarat, Indian American, Maryland Hall, Marylandchamber, Maryla

అమెరికాలోని అగ్రశ్రేణి ఇమ్మిగ్రేషన్ లాయర్లలో ఒకరైన మూర్తి.గుజరాత్‌లోని వడోదరాలో 12 అక్టోబర్ 1961లో జన్మించారు.ఆమె తండ్రి హెచ్ఎంఎస్ మూర్తి భారత సైన్యంలో పనిచేశారు.తండ్రి ఉద్యోగ రీత్యా షీలా కుటుంబం భారత్‌లోని పలు ప్రాంతాల్లో నివసించింది.చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ నుంచి హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన షీలా మూర్తి.యూనివర్సిటీ లా కాలేజ్ బెంగళూరు నుంచి లా పట్టా అందుకున్నారు.

Telugu America, Gujarat, Indian American, Maryland Hall, Marylandchamber, Maryla

హార్వర్డ్ లా స్కూల్ పూర్వ విద్యార్ధి అయిన షీలా మూర్తి.1994లో మేరీలాండ్‌లోని బాల్టిమోర్‌లో న్యాయ సంస్థను స్థాపించారు.అంతేకాదు.మేరీలాండ్‌లో 20 మంది అత్యంత ప్రభావవంతమైన సీఈవోలలో ఒకరిగా… 50 మంది అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో ఒకరిగా షీలా మూర్తి చోటు దక్కించుకున్నారు.‘‘ మూర్తి నాయక్ ఫౌండేషన్‌’’ను స్థాపించి తన భర్త వసంత్ నాయక్‌తో కలిసి ఆమె భారత్, అమెరికాలలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వలసదారుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె కృషి చేస్తున్నారు.

మరోవైపు.మేరీలాండ్ బిజినెస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి తనకు చోటు దక్కడంపై షీలా మూర్తి హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube