రాజకీయాల్లో సెంటిమెంట్ అస్త్రాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి.గెలిస్తే అది చేస్తాం.
ఇది అని చెప్పడం వల్ల రాబట్టే ఓట్ల కన్నా.సానుభూతితోనూ, సెంటిమెంట్ తోను రాబట్టగలిగే ఒట్లే విజయనికి దగ్గర చేస్తాయి.
ఇది ఎప్పుడు కూడా రాజకీయాల్లో సక్సస్ ఫుల్ వ్యూహం అనే చెప్పవచ్చు.ఇలాంటి సెంటిమెంట్ వ్యూహాలను అమలు చేయడంలో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) కొంత ముందు వరుసలో ఉంటారు.2014 ఎన్నికల్లో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న ప్రజాధరణనూ సానుభూతితో ఓట్లు రాబట్టుకోగలిగి దాదాపు గెలిచినంత పని చేశారు.

ఇక 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఆ సెంటిమెంట్ డోస్ ఇంకాస్త పెంచి రాజన్న రాజ్యం తెస్తానని, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జగన్ పండించిన సెంటిమెంట్ కు ఏపీ ప్రజల్లో సానుభూతి పెల్లుబెక్కి ఏకంగా కనీవినీ ఎరుగని విజయాన్ని వైసీపీకి కట్టబెట్టారు.దీంతో ఈ సక్సస్ ఫార్ములానూ అన్నీ పార్టీలు కూడా పాటించేందుకు సిద్దం అవుతునంట్లు తెలుస్తోంది.ఏపీలో జనసేనకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు పవన్( Pawan Kalyan ).రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని, జనసేనకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని పవన్ సెంటిమెంట్ పండిస్తున్నారు.

మరోవైపు లాస్ట్ ఛాన్స్ అంటూ టీడీపీ( TDP ) కూడా ఇదే సెంటిమెంట్ నూ ఫాలో అవుతుంది.ఇక తెలంగాణలో కూడా ఈ సెంటిమెంట్ అస్త్రాన్ని గట్టిగానే ప్రయోగిస్తున్నాయి ఇక్కడి పార్టీలు.బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి రామరాజ్యం తెస్తామని కమలనాథులు చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.కాబట్టి కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ హస్తం నేతలు చెబుతున్నారు.మొత్తానికి ” ఒక్క ఛాన్స్ ప్లీజ్.” వ్యూహాన్ని అన్నీ పార్టీలు కూడా గట్టిగా అమలు చేస్తున్నాయి.

అయితే అన్నీ వేళల ఈ సెంటిమెంట్ వ్యూహం సక్సస్ అవుతుందా అంటే చెప్పడం కష్టమే.ఎందుకంటే పార్టీల పనితీరు విధివిధానాలను బట్టి అధికారాన్ని కట్టబెడతారు ప్రజలు.అందువల్ల ఎంత సెంటిమెంట్ పండించిన చివరకు ప్రజాభిప్రాయంలో ఉన్న పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పక తప్పదు.







