కొన్ని సంఘటనలు వింటే చాలా ఆశ్చర్యం కలగడంతో పాటు ఇది ఎలా సాధ్యం అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతాయి.ఇక కుటుంబ సభ్యులైతే ఏకంగా షాక్ అవుతారు.
వివాహ బంధంతో ఒకటైన దంపతులకు ఎంత ప్రయత్నించినా సంతానం కలగకపోవడంతో.తమ పదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకున్నారు.
తర్వాత అసలు ట్విస్ట్ ఏమిటంటే విడాకుల తర్వాత ఆమె గర్భం( Pregnant ) దాల్చింది.ఇది ఎక్కడో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుంది కదా.దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం.
వివరాల్లోకెళితే.
గుజరాత్ లోని( Gujarat ) వడోదర ప్రాంతానికి చెందిన ఓ బాధితురాలు అభయం హెల్ప్ లైన్ నెంబర్ 181 కు ఫోన్ చేసి.తాను విడాకుల( Divorce ) తర్వాత గర్భం దాల్చానని తనకు సహాయం చేయాలని కోరింది.
ఆ మాటకు ఒక్కసారిగా షాక్ అయినా అభయం టీం విడాకుల తర్వాత గర్భం ఎలా దాల్చారు అని ప్రశ్నించింది.

అందుకు ఆ బాధితురాలు విడాకులు తీసుకున్న తర్వాత తన భర్త ( Husband ) తన వద్దకు తరచూ వస్తూ ఉండేవాడని, తనతో శారీరక సంబంధం కొనసాగించేవాడని తెలిపింది.ఈ క్రమంలో తాను ఏప్రిల్ 21 న గర్భం దాల్చానని, ఈ విషయం భర్తకు చెప్పడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడని తెలిపింది.ఆమె ఎంత బతిమాలిన కూడా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదు అనడంతో తాను హెల్ప్ లైన్ సహాయం కోరిందని తెలిపింది.

అయితే అభయం టీమ్ బాధితురాలు భర్తతో మాట్లాడితే.విడాకులు తీసుకున్న తర్వాత తనకు ఎటువంటి సంబంధం, ఎటువంటి బాధ్యత లేదని మొండిగా వాదించాడు.దీంతో అభయం టీం బాధితురాలుని కర్జాన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి పంచాయతీ పెట్టింది.
అయితే పోలీస్ స్టేషన్లో బాధితురాలు, తమ బంధువులతో రహస్యంగా మాట్లాడుకుని చివరకు తామే ఈ మేటర్ ను సెటిల్ చేసుకుంటామని పోలీసులకు తెలిపారు.
పోలీసులు మీ ఇష్టం అంటూ కేసు నమోదు చేయలేదు.
అసలు అర్థం కాని విషయం ఏమిటంటే సంతానం లేదని విడాకులు తీసుకున్నారు.
మరి విడాకుల తర్వాత బిడ్డ పుడుతుందని తెలిసి కలిసిపోవచ్చు కదా.చివరకు పోలీసులనీ, అభయ్ టీం నీ ఆశ్రయించి చివరకు తమ సమస్య తామే పరిష్కరించుకుంటాం అని అనడం ఎందుకు.? ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.






