మొటిమలు తగ్గిన వాటి తాలూకు మచ్చలు పోవట్లేదా? అయితే ఈ రెమెడీ మీకే!

యుక్త వయసు ప్రారంభం కాగానే సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో మొటిమలు( pimples ) ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.అయితే కొందరికి మొటిమలు తగ్గిన.

 Super Effective Remedy For Acne Scars , Home Remedy, Latest News, Acne Scars, La-TeluguStop.com

వాటి తాలూకు మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి.మచ్చలు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా పాడుచేస్తాయి.

ఈ క్రమంలోనే మొటిమల తాలూకు మచ్చల‌ను వదిలించుకునేందుకు తోచిన ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక మదన పడుతూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.మొటిమల తాలూకు మ‌చ్చ‌ల‌ను వదిలించడానికి ఈ రెమెడీని సమర్థవంతంగా పని చేస్తుంది.

అదే సమయంలో చర్మాన్ని కాంతివంతంగా సైతం మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Acne Scars, Tips, Clear Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips-T

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు రెబ్బల వేపాకు( Neem ), పది తులసి ఆకులు, అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ ను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.

Telugu Acne Scars, Tips, Clear Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips-T

చివరిగా రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మొటిమ‌ల తాలూకు మచ్చలే కాదు ఎలాంటి మచ్చలైన క్రమంగా మాయం అవుతాయి.

క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అదే సమయంలో చర్మం కాంతివంతంగా సైతం మెరుస్తుంది.కాబట్టి మొటిమల తాలూకు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube