బాహుబలి నిర్మాతలకు ఓకే చెప్పిన ప్రభాస్.. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) స్టార్ డమ్ గురించి అందరికి తెలిసిందే.బాహుబలి ( Baahubali ) సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుని అలాగే మార్కెట్ కూడా పెంచుకున్నాడు.

 Prabhas To Collaborate With Baahubali Producers Details, Baahubali, Baahubali Pr-TeluguStop.com

పాన్ ఇండియా లెవల్లో చేసిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ బాహుబలి 2 తో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు.

మరి ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మళ్ళీ బాహుబలి నిర్మాతలు ( Baahubali producers ) ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసే ప్లాన్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డిస్కర్షన్ కూడా నడుస్తున్నట్టు టాక్.ప్రభాస్ కూడా సానుకూలంగానే స్పందించారని.వీరితో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.ఎందుకంటే ప్రభాస్ చేతిలో ప్రజెంట్ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.వీటితో ఈయన బిజీగా ఉన్నాడు.ఈ సినిమాల షూటింగులు మొత్తం పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నారు.అయితే ఈసారి బాహుబలి సినిమాలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మునుపెన్నడూ చేయని పాత్రను ఈసారి ప్రభాస్ చేయనున్నారట.దీనిపై ముందు ముందు మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు.అలాగే మారుతి దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాల్లో ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కానుండగా.సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వనుంది.ఇక ప్రాజెక్ట్ కే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవ్వనుంది.మారుతి సినిమా గురించి అయితే ఇంకా ఎలాంటి డీటెయిల్స్ బయటకు రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube