ఉమైర్ సంధు.( Umair Sandhu ) ఇటీవల కాలంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఎక్కువగా మారుమోగుతున్న పేరు.
ఇదివరకు కేవలం సినిమాల రివ్యూలు మాత్రమే ఇచ్చిన క్రిటిక్ ఉమైర్ సంధు ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోయి నోటికి ఎంత వస్తే అంత ఊహించుకొని తనకు తోచిన విధంగా సంచలన ట్వీట్స్ చేస్తున్నాడు.అంతే కాకుండా హీరో హీరోయిన్ లకు మధ్య ఎఫైర్లు అంటగడుతున్నాడు.
ఇటీవల కాలంలో ఉమైర్ సంధు అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పవచ్చు.
నిత్యం ఎవరో ఒకరిని సెలబ్రిటీలను టార్గెట్ చేయడం వారి గురించి వారి పర్సనల్ విషయాల గురించి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నాడు.
ఇటీవల హీరో అక్కినేని అఖిల్( Akhil Akkineni ), ఊర్వశి రౌతేలా ను హెరాస్ చేశాడని ఆమెను ఇబ్బంది పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇక తాజాగా ఆ ట్వీట్ పై స్పందించినా ఊర్వశి( Urvashi Rautela ) మండిపడింది.
ఈ క్రమంలోనే ఊర్వశి రౌతేలా, ఉమైర్ సంధుకి లీగల్ నోటీసులు పంపింది.ఇదే విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.అయితే ఉమైర్ సంధు పేరును ప్రస్తావించనప్పటికీ అతడు చేసిన ట్వీట్ ని స్క్రీన్ షాట్ ఫోటో పెట్టింది.రోజురోజుకీ అతడి ఆగడాలు పెరిగిపోతుండడంతో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకున్న ఆమె అతనికి లీగల్ నోటీసులు పంపించినట్టు తెలిపింది.
ఇకపోతే ఊర్వశి విషయానికి వస్తే.
ఇటీవలె చిరంజీవి నటించిన వాళ్తేరు వీరయ్య సినిమాలో బాబు వేర్ ఇస్ ద పార్టీ అంటూ స్టెప్పులను ఇరగదీసిన విషయం తెలిసిందే.ఈ పాట తర్వాత కొద్ది రోజులపాటు ఊర్వశి పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారు మోగిపోయింది.అంతేకాకుండా ఈ పాట తర్వాత ఈమెకు టాలీవుడ్ లో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
టాలీవుడ్ దర్శకుడు సినిమాలో ఐటమ్ సాంగులకు ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.