ఉపాసన బేబీ షవర్ ఫంక్షన్ లో అల్లు అర్జున్.... మెగా అల్లు విభేదాలకు చెక్ పెట్టిన హీరో!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మెగా కుటుంబం(Mega Family) అల్లు కుటుంబం(Allu Family) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే గత కొద్ది రోజులుగా మెగా అల్లు కుటుంబాలకు పడటం లేదని ముఖ్యంగా అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

 Allu Arjun In Upasana Baby Shower Function Details, Upasana,saniya Mirza,pregnan-TeluguStop.com

ఈ క్రమంలోనే వీరిద్దరి అభిమానుల మధ్య కూడా ఈ విషయంలో తరచూ సోషల్ మీడియా వార్ జరుగుతూ ఉండేది.అయితే తాజాగా అల్లు అర్జున్(Allu Arjun) ఈ వార్తలన్నింటికీ పులి స్టాప్ పెట్టేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్ సతీమణి ఉపాసన(Upasana) ప్రెగ్నెంట్ (Pregnant)అనే విషయం మనకు తెలిసిందే.మరికొద్ది రోజులలో ఈమె తల్లి కాబోతున్నారు.ఇలా పెళ్లయిన పది సంవత్సరాలకు రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఉపాసన స్నేహితులు తరచూ తనకు బేబీ షవర్(Baby Shower) వేడుకను నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.

దుబాయ్ లో ఘనంగా బేబి షవర్ జరుపుకున్న ఉపాసన తాజాగా ఆదివారం హైదరాబాద్లో తనసన్నిహితుల నడుమ బేబీ షవర్ వేడుకను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే తన స్నేహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక ఉపాసన బేబీ షవర్ వేడుకకు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సైతం హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఉపాసన రాంచరణ్ దంపతులకు ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధంగా బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఉపాసనతో కలిసి అల్లు అర్జున్ దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని భావిస్తున్నారు.ఇక ఈ బేబీ షవర్ వేడుకలో సానియా మీర్జా(Saniya Mirza) కూడా సందడి చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube