కుక్కలు( Dogs ) పెంచుకునే వారికి కొన్ని సమస్యలు ఎదురు కావడం చాలా కామన్.ముఖ్యంగా యజమానులు కొన్ని రోజులపాటు ఇంటికి దూరంగా వెళ్లినప్పుడు పెంపుడు కుక్కలు చాలా బాధ పడిపోతాయి.
ఫుడ్ తినకుండా యజమాని వచ్చేంతవరకు అవి అలుగుతాయి.యజమానులు కూడా చాలా బాధగా ఫీల్ అవుతారు.
తమ కుక్క ఫుడ్ తింటుందో లేదో అని దిగులు చెందుతారు.అయితే ఇండియన్ రైల్వేలో ప్రయాణించే వారికి ఈ సమస్య ఉండదు.
ఎందుకంటే వారు తమ కుక్కను తమతో పాటే ట్రైన్‌లో ఎక్కించుకొని తీసుకెళ్లొచ్చు.కాకపోతే కొన్ని రూల్స్ పాటించాలి.
మరి ఆ రూల్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ రైల్వే(Indian Railways ) కొత్త నిబంధనల ప్రకారం కుక్కలను రైళ్లలో ఫస్ట్ క్లాస్‌లో మాత్రమే తీసుకెళ్లాలి.మరే తరగతిలోనూ వాటిని ఎక్కించకూడదు.ప్రయాణికుడు తమ కుక్కను తీసుకురావాలంటే ముందుగా ఫస్ట్ క్లాస్‌లో నాలుగు బెర్త్‌లు లేదా ఒక కంపార్ట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.
కుక్కల వల్ల ఇతర ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ఈ సరికొత్త నిబంధన ప్రవేశపెట్టింది.

అంతేకాకుండా, కుక్కను నేరుగా రైలులో ఎక్కించడం కుదరదు.ట్రైన్ ఎక్కడానికి మూడు గంటల ముందు కుక్కను లగేజీ ఆఫీస్‌కి తీసుకెళ్లాలి.అప్పుడు అక్కడ అధికారులు దానిని పరిశీలించి అనుమతి ఇస్తారు.
ఆ సమయంలో కుక్క జాతి ఏంటి దాని లింగం తో పాటు మరిన్ని వివరాలను తెలపాలి.అనుమతి పొందిన తర్వాత ఫస్ట్ క్లాస్ కోచ్‌లో దానిని ఎక్కించాలి.
వేరే క్లాసులో కుక్కను ఎక్కిస్తే జరిమానా చెల్లించక తప్పదు.

కుక్క కోసం ఒక డాక్టర్ సర్టిఫికేట్( Doctor certificate ) కూడా సమర్పించాలి.ఇక ఇండియన్ రైల్వే చట్టంలోని సెక్షన్ 77-A ప్రకారం యానిమల్స్ కోసం స్పెషల్‌గా రూపొందించిన కంపార్ట్‌మెంట్లలో పెంపుడు కుక్కలను తీసుకెళ్లొచ్చు.దానికి కూడా కొంత మొత్తం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది.
ఇక రైలు ఎక్కిన సమయం నుంచి కుక్క బాధ్యతలన్నీ యజమానే చూసుకోవాలి.







