మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సంయుక్త మీనన్ (Samyuktha Menon)జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం విరూపాక్ష.ఈ సినిమా ఈనెల 21వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుతుంది.
ఇక ఈ సినిమాకు అన్ని ప్రాంతాలలోనూ అద్భుతమైన ఆదరణ రావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున వెళ్తూ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.ఇలాంటి సమయంలోనే చిత్ర బృందం అభిమానులకు చిన్న విన్నపాన్ని తెలియజేశారు.
ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయని వాటిని ముందుగా ఎవరు లీక్ చేయొద్దని కోరారు.

సినిమాలో ఎన్నో కీలక అంశాలు, ట్విస్టులు ఉన్నాయని వాటిని బయట ఎక్కడ లీక్ చేయొద్దని,వెండితెరపై సినిమా చూసి ఒక అద్భుతమైన అనుభూతిని పొందండని ఈ సందర్భంగా నిర్మాతలు ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశారు.ఇక ఈ సినిమా మొత్తం రుద్రవనం( Rudravanam ) అనే గ్రామం చుట్టూ సాగే కథతో రూపుదిద్దుకుందని తెలియజేశారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో హీరో సాయిధరమ్ సైతం ఎంతో సంతోషంగా ఉన్నారు.

ముఖ్యంగా ఈయన ప్రమాదానికి గురైన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమానే ఇలా మంచి సక్సెస్ అందుకోవడంతో హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక నటి సంయుక్త మీనన్ తెలుగులో నటించిన వరుస సినిమాలన్నీ మంచి సక్సెస్ కావడంతో ఇండస్ట్రీకి ఈమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.ఇక విరుపాక్ష (Virupaksha) సినిమాతో కూడా మరొక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మేకర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు.







