ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే పండుగ రంజాన్( Ramzan ).ఇక ఈ ఏడాది ఈ పండుగను ముస్లిం సోదరులు ఏప్రిల్ 22వ తేదీ ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే సినీ నటుడు ఆలీ కుటుంబం కూడా రంజాన్ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.ఇక రంజాన్ పండుగను పురస్కరించుకొని అలీ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని( Chiranjeevi ) కలిశారు.
ఈ క్రమంలోనే చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను ఆలీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రంజాన్ పండుగ సందర్భంగా అలీ ( Ali )చిరంజీవిని కలవడంతో చిరంజీవి అలికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా రంజాన్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని, పవిత్రమైన ప్రార్థనలతో ఆ అల్లా దీవెనలు పొందాలని చిరంజీవి ఆకాంక్షించారు.ఎంతో పవిత్రమైన ఈ పండుగను మెగాస్టార్ చిరంజీవితో కలిసి పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆలీ వెల్లడించారు.ఇక ఆలీ రంజాన్ పండుగకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.
ఈ ఫోటోలలో ఆలీ కుటుంబంతో పాటు తన తమ్ముడు ఖయ్యూం కుటుంబంతో కలిసి ఈ పండుగను జరుపుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అలీ రంజాన్ పండుగకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఆలీ విషయానికొస్తే ప్రస్తుతం ఈయన సినిమాలు కాస్త తగ్గించారని చెప్పాలి.కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.

అలాగే బుల్లితెరపై ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈయన ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కాస్త బ్రేక్ ఇచ్చారు.ఇక ఈయన రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా అలీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.







