టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక( Niharika ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన నిహారిక ఈ క్రమంలోనే బుల్లితెరపై పలుషోలకు యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.అలా ఒక మనసు సినిమాలో హీరోయిన్గా నటించిన నిహారిక ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం( Happy wedding, Suryakantham ) లాంటి సినిమాలలో హీరోయిన్గా నటించినప్పటికీ సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి.

యాంకర్ గా భారీగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నిహారిక హీరోయిన్ గా మాత్రం సక్సెస్ అవ్వలేకపోయింది.ఆ తర్వాత ఈమె జొన్నలగడ్డ చైతన్యను( Jonnalagadda Chaitanya ) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇక పెళ్లి చేసుకున్నప్పటికీ నిహారిక అల్లరి జోరు ఏమాత్రం తగ్గడం లేదు.తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది నిహారిక.తన భర్తతో కలిసి ఎక్కువగా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూనే ఉంది.అంతేకాకుండా ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవల నిహారిక పెళ్లి గురించి ఆమె విడాకుల గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టేసింది నిహారిక.ఇది ఇలా ఉంటే తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆ ఫోటోలలో పర్పుల్ కలర్ సారీ ని ధరించిన నిహారిక తన చూపులతోనే మత్తెక్కిస్తోంది.
ముక్కుపుడక ధరించి తన చేతులను పైకెత్తి అలా ఫోటోలకు ఫోజులు ఇచ్చు నడుము అందాలతో కాక రేపుతోంది.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించడంతోపాటు మెగా అభిమానులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
మేము చూస్తున్నది మీ నిహారిక నేనా ఈ ఫోటోలలో చాలా సరికొత్తగా కనిపిస్తోంది సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.







