టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి( Rajamouli ) తెరకెక్కించిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2( Baahubali ) సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే.తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ని పరిచయం చేసింది బాహుబలి సినిమానే అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో శివుడిగా ప్రభాస్, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, భళ్లాలదేవగా రానా, బిజ్జలదేవగా నాజర్ వంటి నటులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా అనుష్క డీ గ్లామర్ రోజుల్లో దేవసేనగా అద్భుతంగా నటించింది.

ఇందులో భళ్లాలదేవ దేవసేనను సంకెళ్లతో బంధించి చిత్రహింసలు పెడుతున్న కూడా ఆమె మాత్రం తన సంకెళ్లను తెంచడానికి తన కొడుకు వస్తాడని ఎదురుచూస్తూ ఉంటుంది.పుల్లలు ఏరుతూ భల్లాలదేవ కోసం చితి పేరుస్తూ ఉంటుంది.కాగా ఈ సన్నివేశంలో అనుష్కకు డూప్ గా ఒక హీరోయిన్ నటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనుష్కకు డూప్ గా మరో హీరోయిన్ నటించింది అన్న విషయం చాలామందికి తెలియదు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె మరెవరో కాదు, హీరోయిన్ రుషిక రాజ్( Rushika raj ).2021లో వచ్చిన అశ్మీ అనే సినిమాలో నటించింది.ఈ సినిమాలో బోల్డ్ గా నటించింది.ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ హీరోయిన్ పెద్దగా క్లిక్ అవ్వలేదు.అయితే నటిగా ఈమె మొదటి సినిమా అశ్మీ అనుకుంటారు కానీ బాహుబలి సినిమానే ఈమె మొదటి సినిమా బాహుబలి సినిమాలో అనుష్క డూప్ గా నటించింది.కకాగా ఈమె దూరం నుంచి చూస్తే అచ్చం అనుష్కలా కనిపించేది.
దూరం నుంచి చూస్తే అనుష్క, రుషిక రాజ్ ఇద్దరూ ఒకేలా ఉంటారు.

ఎత్తు, రంగు ఒకేలా ఉండడంతో గుర్తుపట్టడం కష్టం.ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన బాణాలు సంధించే సీక్వెన్స్ లో ఎక్కువగా కనిపించేది రుషిక రాజ్ నే.అలాగే మాసిన చీరలో ఉన్న సన్నివేశాల్లో కూడా అనుష్క డూప్ గా రుషిక రాజ్ నే నటించింది.ఈ బాహుబలి సిరీస్ లో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా నటించింది.ప్రస్తుతం వీటికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అశ్మీ సినిమా( Asmee )లో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.అయినా గానీ అవకాశాలు రావడం లేదు.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







