టాలీవుడ్ యంగ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) తాజాగా నటించిన సినిమా విరూపాక్ష( Virupaksha ).తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లో వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్( Sanyukta Menon ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం చిత్ర బృందం పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంటోంది.
ప్రస్తుతం చిత్ర బృందం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అల్లుడు సాయి ధరంతేజ్ కి శుభాకాంక్షలు తెలపడంతో పాటు చిత్ర బృందానికి కూడా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.సాయితేజ్ సక్సెస్‌ని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటోంది.
కాగా తాజాగా హీరో రామ్ చరణ్ విరూపాక్ష సినిమా సక్సెస్ పై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

కంగ్రాట్స్.మై బ్రదర్.విరూపాక్ష సినిమా గురించి చాలా మంచి టాక్ వింటున్నా అని రాసుకొచ్చారు చెర్రీ.
ఇది ఇలా ఉంటే యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఫ్లాప్ లతో సతమతమవుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా ఊరట కలిగించింది.
ఈ సినిమా సక్సెస్ పై స్పందించిన పలువురు అభిమానులు ఈ సినిమాతో పాటు సాయి ధరంతేజ్ నటించిన ప్రతి సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు సాయి తేజ్ రీ ఎంట్రీ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







