రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు తదితర గ్రామాలలో శనివారం రంజాన్ పండుగ పర్వదినం ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు.నూతన దుస్తులు ధరించి చిన్నా,పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం ఒకరికొకరు కులమతం భేదం లేకుండా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ప్రార్థనలతోపాటు రంజాన్ పండుగ విశిష్టత గురుంచి వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, మనోహర్, కోడె శ్రీనివాస్, సర్వర్ ఫాషా, అన్వర్, ముక్తార్, ముస్లింలు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







