హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోచమ్మ బస్తీలో హైటెన్షన్ నెలకొంది.బస్తీలోని స్థలం విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగారు.
వివాదం కాస్తా ముదరడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.అయితే కోర్టు ఆర్డర్ తో వచ్చిన వారిపై భూ కబ్జాదారులు దాడి చేశారని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఘటనలో కొందరికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.







