పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) స్టార్ డమ్ గురించి అందరికి తెలిసిందే.ఈయన టాలీవుడ్ లో ప్రెజెంట్ ఉన్న స్టార్ట్ హీరోల్లో మొట్టమొదటిగా పాన్ ఇండియా వ్యాప్తంగా పాగా వేసాడు.
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుని అలాగే మార్కెట్ కూడా పెంచుకున్నాడు.సరైన సినిమా సరైన రోల్ పడితే డార్లింగ్ ఏ రేంజ్ లో వసూళ్లు సాధించగలడో బాహుబలి సిరీస్ నిరూపించింది.
ఇక ఈ సినిమా తర్వాత డార్లింగ్ ప్రకటించిన సినిమాల్లో ఎక్కువుగా ఫ్యాన్స్ హోప్స్ పెంచుకుంది మాత్రం ”ఆదిపురుష్” ( Adipurush ) అనే చెప్పాలి.ఎందుకంటే ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కుతోందని అందరికి తెలిసిందే.
మరి ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు.ఈయన కటౌట్ కు తగ్గ పాత్ర అని ఫ్యాన్స్ మురిసిపోయారు.
అయితే అటువంటి సమయంలోనే ఆదిపురుష్ నుండి టీజర్ రిలీజ్ చేయడం అది కాస్త ఫ్యాన్స్ కు నచ్చకపోవడంతో ఈ సినిమాపై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది.దీంతో మేకర్స్ మళ్ళీ ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ ( VFX Works )చేసి తాజాగా పోస్టర్స్ రిలీజ్ చేసారు.ఇక నిన్న సాయంత్రం వచ్చిన పోస్టర్ అయితే క్రేజీగా మారింది.ప్రభాస్ లాంటి కటౌట్ ని శ్రీరాముని పాత్రలో చూసి ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది.
ఈ పోస్టర్ ఈ సినిమాపై మంచి బజ్ ను తీసుకు వచ్చింది అనే చెప్పాలి.నిన్న వచ్చిన పోస్టర్ ప్రభాస్ చరిష్మాకు తగ్గ రేంజ్ లో కరెక్ట్ పోస్టర్ అని.ఇదే పోస్టర్ ముందే వచ్చి ఉంటే ఈ సినిమా కథ వేరుగా ఉండేదని అంటున్నారు.ఈ పోస్టర్ లో ప్రభాస్ విల్లు పట్టుకుని నిలువెత్తు రామ దర్శనం అందరిని కట్టిపడేసింది.
దీంతో ఈ పోస్టర్ కు భారీ హైప్ వచ్చింది.
మొత్తానికి నిన్న వచ్చిన పోస్టర్ మాత్రమే కాదు ఈ రోజు వచ్చిన జై శ్రీరామ్ తెలుగు వర్షన్ సాంగ్ కూడా అందరిని అలరిస్తుంది.వచ్చింది చిన్న బిట్ అయిన కూడా ఓ రేంజ్ లో అలరిస్తుంది అనే చెప్పాలి.మొత్తానికి కొత్త అప్డేట్ లతో ఈ సినిమాపై అందరిలో పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేసారు.
మరి రిలీజ్ దగ్గర పడేకొద్దీ ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారో వేచి చూడాలి.